T-Congress to Visit Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, వీడియో ఇదిగో...
అసెంబ్లీ నుండి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ను నేతలు సందర్శించనున్నారు
కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలు దేరారు. అసెంబ్లీ నుండి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ను నేతలు సందర్శించనున్నారు. భువనగిరి, జనగామ, హనుమకొండ మీదుగా జయశంకర్భూపాలపల్లి జిల్లా అంబట్‌పల్లిలోని మేడిగడ్డ బ్యారేజీకి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 3.30 గంటల నుండి 5 గంటల మధ్యలో మేడిగడ్డలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పిల్లర్లతో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలిస్తారు. అనంతరం అక్కడే ఇరిగేషన్అధికారులు, ఇంజనీర్లతో రివ్యూ చేస్తారు. ఇంజనీర్లు బ్యారేజీ కుంగుబాటుపై ప్రజంటేషన్ఇస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు సీఎం, మంత్రులు మీడియాతో మాట్లాడతారు. అనంతరం అందరూ తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతారు. రాత్రి 8.30 గంటలకు పరకాలలో హోటల్ లో డిన్నర్ చేస్తారు. 9.30 గంటలకు పరకాల నుండి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అవుతారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రావాలని ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖ రాశారు. ఈ పర్యటనకు రావాలని కేసీఆర్‌ను కూడా ఆహ్వానించారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)