CM KCR Bengaluru Tour: మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయిన సీఎం కేసీఆర్, దేశ రాజకీయాలు, రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగుళూరు పర్యటన కొనసాగుతోంది. మాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) నివాసానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కాసేపటికి క్రితమే చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కుమార్ స్వామి (Kumar Swamy)... కేసీఆర్‌కు స్వాగతం పలికారు.

CM KCR Bengaluru Tour

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగుళూరు పర్యటన కొనసాగుతోంది. మాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) నివాసానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కాసేపటికి క్రితమే చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కుమార్ స్వామి (Kumar Swamy)... కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అనంతరం దేవెగౌడ, కుమారస్వామితో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. దేశ రాజకీయాలు, రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చలు సాగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.

మరోవైపు హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) తన ప్రసంగంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ కుటుంబ పాలనతో అవినీతిమయం అయ్యిందంటూ ప్రధాని విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోదీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా సీఎం కేసీఆర్ బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now