Telangana Elections 2023: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు, అజారుద్దీన్, విష్ణువర్ధన్‌రెడ్డి వర్గాల మధ్య భగ్గుమన్న గొడవలు
నియోజకవర్గంలో అజారుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించగా పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వర్గం అడ్డుకుంది
జూబ్లీ హిల్స్ నియోజక వర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలో అజారుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించగా పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వర్గం అడ్డుకుంది. విష్ణుకు చెందిన నియోజకవర్గంలో ఆయనకు సమాచారం అందించకుండా మీటింగ్ ఎలా పెడతారంటూ నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకోగా.. పోలీసులు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఈ నిజయోకవర్గం నుంచి విష్ణువర్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక మహమద్ అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోరాదాబాద్(యూపీ) నుంచి ఎంపీగా నెగ్గారు. 2019లో సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా.. భంగపాటే ఎదురైంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌గా ఉన్న అజారుద్దీన్.. ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెహమత్ నగర్‌లో సమావేశం నిర్వహించారనే వార్తలు వస్తున్నాయి.
Heres' Clash Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)