Telangana: టీజీపీఎస్సీ గ్రూప్1 ఔత్సాహికులకు గుడ్ న్యూస్, నెలకు రూ 5,000 స్టైఫండ్‌తో పాటు ఉచిత కోచింగ్ అందిస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కారు
తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్1 ఔత్సాహికులకు నెలకు రూ 5,000 స్టైఫండ్‌తో పాటు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.కాగా టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి.
free coaching to TGPSC Group1 aspirants: తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్1 ఔత్సాహికులకు నెలకు రూ 5,000 స్టైఫండ్‌తో పాటు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.కాగా టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. 1:50 ప్రకారం మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది.గ్రూప్-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సెప్టెంబర్ 21 నుంచి 27వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో 1:100 రేషియోతో అభ్యర్థుల ఎంపిక ఉండాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కానీ, ప్రభుత్వం మాత్రం 1:50 రేషియాతో ఫలితాలను వెల్లడించడం గమనార్హం. ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్... జూన్ లో ఓసారి, డిసెంబర్ లో మరోసారి నిర్వహణ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Here's News