Adani Row: తెలుగు రాష్ట్రాల్లో అదాని ప్రకంపనలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు నిరసనకు దిగన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ధర్నాకు దిగారు.ఆదానికి వేల కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారంటూ డిమాండ్ చేస్తూ వారు SBI ముందు నిరసనలు చేపట్టారు.

Congress Protest (Photo-ANI)

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ధర్నాకు దిగారు.ఆదానికి వేల కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారంటూ డిమాండ్ చేస్తూ వారు SBI ముందు నిరసనలు చేపట్టారు. ఇంటర్ మాత్రమే చదివిన అదానీకి వేల కోట్ల రుణాన్ని ఎలాంటి ష్యూరిటీ లేకుండానే ఇచ్చారని.. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్‌బీఐ ముందు సోమవారం ఉదయం ఆయన నిరసనకు దిగారు. అదానీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

రూ.30 వేల కోట్ల రుణాన్ని మోదీ స్నేహితుడు అదానీకి రాజకీయ పలుకుబడితో ఎస్‌బీఐ కట్టబెట్టిందని ఆరోపించారు. దేశంలోని 24 వేల బ్రాంచ్‌లు ఉన్న ఎస్‌బీఐ దివాలా తీస్తోందని చెప్పారు. ఎస్‌బీఐని అదానీ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చండంటూ ఎద్దేవా చేశారు. ఎల్ఐసీని కూడా అదానీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌గా మార్చాలన్నారు.హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ధర్నా నిరసనలు చేపట్టారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Hindi Row: బలవంతంగా హిందీ భాషను ఎవరిపైనా రుద్దే ప్రసక్తే లేదు, సీఎం స్టాలిన్ లేఖకు స్పందించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

Atchannaidu Slams Jagan: జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే పచ్చి అబద్దాలు చెబుతున్నారు, మండిపడిన మంత్రి అచ్చెన్నాయుడు

Sam Pitroda: చైనాను శత్రుదేశంగా భారత్ చూడటం మానుకోవాలి, కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ చైనా తొత్తు అంటూ విరుచుకుపడిన బీజేపీ

Central University Students Protest: వీడియో ఇదిగో, సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం, విద్యార్థినుల బాత్రూం లోకి తొంగి చూసిన గుర్తు తెలియని వ్యక్తులు, అర్థరాత్రి ధర్నాకు దిగిన విద్యార్థినులు

Share Now