Telangana Couple Electrocuted: ఇనుప తీగకు బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్, కుప్పకూలి మృతి చెందిన భార్యాభర్తలు

వీధిలోని విద్యుత్ లైన్‌కు తీగ తగలడంతో విషాదం చోటుచేసుకుంది.

Duo Gets Electric Shock While Drying Clothes in Vikarabad District (photo/X/Telugu Scribe)

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు. ఈ ఘటన బొమ్రాస్‌పేట మండలం బుర్హాన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బోయిన లక్ష్మణ్ (48), అతని భార్య లక్ష్మి (42) ఇంటి ముందు ఉన్న ఇనుప తీగకు బట్టలు ఆరేస్తుండగా.. వీధిలోని విద్యుత్ లైన్‌కు తీగ తగలడంతో విషాదం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఉన్న సాంకేతిక సమస్య కారణంగా ఈ సంఘటన జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు