Cylinder Blast in Karachi Bakery: వీడియో ఇదిగో, కరాచీ బేకరిలో భారీ పేలుడు, 15 మందికి తీవ్ర గాయాలు, ఆరుగురి పరిస్థితి విషమం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ RGIA పోలీస్‌స్టేషన్ పరిధిలోని గగన్ పహడ్‌లో భారీ పేలుడు సంభవించింది. రాజేంద్రనగర్‌లోని ఓ కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది. కరాచీ బేకరీ క్యాంటీన్‌లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవటంతో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ RGIA పోలీస్‌స్టేషన్ పరిధిలోని గగన్ పహడ్‌లో భారీ పేలుడు సంభవించింది. రాజేంద్రనగర్‌లోని ఓ కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది. కరాచీ బేకరీ క్యాంటీన్‌లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవటంతో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద దాటికి కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా యూపీకి చెందిన వారు ఉన్నారని అధికారులు సీఎంకు తెలిపారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)