Telangana: మంచి నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంక్లో కోతుల మృతదేహాలు, కొన్ని రోజుల నుంచి అవే నీళ్లు తాగుతున్న ఆ మున్సిపాలిటీ ప్రజలు, వీడియోలు ఇవిగో..

దాదాపు 30 కోతుల మృతదేహాలు ట్యాంకులో లభించాయి.అయితే గత కొన్ని రోజులుగా ఇదే ట్యాంకు నుంచి మంచినీటి సరఫరా చేస్తున్నారు ఎన్ఎస్పీ అధికారులు.

Dead bodies of monkeys Found in water tank, people drinking the same water for several days in Nandikonda Municipality under Nagarjuna Sagar

నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో 1వ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్లో కోతుల మృతదేహాలు లభించాయి. దాదాపు 30 కోతుల మృతదేహాలు ట్యాంకులో లభించాయి.అయితే గత కొన్ని రోజులు ఇదే ట్యాంకు నుంచి మంచినీటిని సరఫరా చేస్తున్నారు ఎన్ఎస్పీ అధికారులు. ఆ నీటిని తాగిన అక్కడి ప్రజలు..ట్యాంకులో మరణించిన కోతుల మృతుల దేహాలు బయటపడటంతో ఆందోళన చెందుతున్నారు. వాటర్ ట్యాంకుపై రేకుల మూత తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లిన కోతులు.. బయటికి రాలేక అందులోనే మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వాటిని బయటికి తీసేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, డైరెక్టర్‌‌తో పాటుగా ఆరుగురు కార్మికులు మృతి, వీడియోలు ఇవిగో..

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు