Deputy CM Mallu Warns BRS: కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్రజేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉండదు, మా సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మేమేంటో చూపిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరిక

కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తాము సహనంగా ఉన్నామన్నారు.

Mallu Bhatti Vikramarka (Photo-X)

తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మేమేంటో చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క BRS లీడర్లకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షానికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తాము సహనంగా ఉన్నామన్నారు. కానీ దీనిని చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు.ప్రతిపక్ష నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. మనది ప్రజాస్వామ్య దేశం... ప్రజాస్వామ్య రాష్ట్రం.. కానీ ఇష్టారీతిన మాట్లాడవద్దన్నారు. తాము కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ మిగలదన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఆ దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండింటిని అమలు చేశామని మల్లు భట్టి తెలిపారు. రానున్న రోజుల్లో మిగిలిన వాటిని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన