Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల 4వ జాబితా విడుదల, మునుగోడు స్థానం నుంచి చల్లమల్ల కృష్ణారెడ్డి పోటీ

బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధుల నాలుగో జాబితాను విడుదల చేసింది. 12మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది. చెన్నూరు స్థానాన్ని దుర్గం అశోక్ కి, ఎల్లారెడ్డి సీటును వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి కేటాయించారు. వికారాబాద్ స్థానం పెద్దిరెడ్డి నవీన్ కుమారికి, సిద్దిపేట సీటు దూడి శ్రీకాంత్ రెడ్డికి దక్కాయి. కొడంగల్ నుంచి బంటు రమేష్ కుమార్, గద్వాల నుంచి బోయ శివ, వేములవాడ నుంచి తుల ఉమను బరిలోకి దించుతున్నారు.

BJP Flag. File photo

బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధుల నాలుగో జాబితాను విడుదల చేసింది. 12మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది. చెన్నూరు స్థానాన్ని దుర్గం అశోక్ కి, ఎల్లారెడ్డి సీటును వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి కేటాయించారు. వికారాబాద్ స్థానం పెద్దిరెడ్డి నవీన్ కుమారికి, సిద్దిపేట సీటు దూడి శ్రీకాంత్ రెడ్డికి దక్కాయి. కొడంగల్ నుంచి బంటు రమేష్ కుమార్, గద్వాల నుంచి బోయ శివ, వేములవాడ నుంచి తుల ఉమను బరిలోకి దించుతున్నారు. మునుగోడు స్థానం చల్లమల్ల కృష్ణారెడ్డికి, మిర్యాలగూడ సీటు సాదినేని శ్రీనివాస్ కు, హుస్నాబాద్ సీటుని బొమ్మా శ్రీరామ్ చక్రవర్తికి కేటాయించారు. నకిరేకల్ నుంచి నకరకంటి మెుగలయ్య, ములుగు నుంచి ప్రహ్లాద్ నాయక్ ను ప్రకటించారు. ఈ లిస్టుతో బీజేపీ మొత్తం 100 మంది అభ్యర్దులను ప్రకటించింది.దీంతో ఇప్పటి వరకు మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను.. 100 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో మిగిలిన అభ్యర్థులను కూడా రేపు ప్రకటించే అవకాశం ఉంది.

4th list of BJP MLA candidates released

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now