Telangana Elections 2023: వరుసగా 5వ సారి బరిలో, సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేసిన మంత్రి కేటీఆర్, ప్రగతి భవన్‌లో ప్రత్యేక పూజలు
సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఐదోసారి బరిలో నిలిచారు. నామినేషన్ దాఖలు కంటే ముందు కేటీఆర్ ప్రగతి భవన్‌లో ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.
సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఐదోసారి బరిలో నిలిచారు. నామినేషన్ దాఖలు కంటే ముందు కేటీఆర్ ప్రగతి భవన్‌లో ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో ఆర్మూర్‌లో నిర్వహించే రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొననున్నారు. సాయంత్రం కొడంగల్‌లో నిర్వహించే రోడ్‌షోలో పాల్గొననున్నారు.
మొదటిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేశారు. సమీప ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010 ఉప ఎన్నికల్లో బరిలో నిలిచారు. సమీప ప్రత్యర్ధి కేకే మహేందర్ రెడ్డిపై 68,219 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 జనరల్ ఎన్నికల్లో 53,004 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తిరిగి 2018 ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు.
Heres' Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)