Telangana Elections 2023: కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్‌గా తీన్మార్ మల్లన్న, పార్టీలో చేరిన వెంటనే కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ హైకమాండ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్నకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.పార్టీలో చేరిన వెంటనే కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. అయితే.. ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మధుయాష్కీ గౌడ్.. ఎల్బీ నగర్‌కు వెళ్లగా.. క్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహారాలను మల్లన్న చూసుకుంటారు.

Teenmar Mallanna (Photo-Video Grab)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్నకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.పార్టీలో చేరిన వెంటనే కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. అయితే.. ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మధుయాష్కీ గౌడ్.. ఎల్బీ నగర్‌కు వెళ్లగా.. క్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహారాలను మల్లన్న చూసుకుంటారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుండగా.. మల్లన్న కూడా చేరడంతో కాంగ్రెస్ ప్రచారం మరో స్థాయికి చేరుకోకపోవచ్చని శ్రేణులు భావిస్తున్నాయి.కోఆర్డినేటర్‌ను నియమిస్తూ ప్రకటించిన ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని..ప్రచారానికి సంబంధించిన కార్యక్రమం, ప్రణాళికను సిద్ధం చేస్తామని చెబుతున్నారు

కాగా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న... తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అబ్జర్వర్ బోస్ రాజు, సీడబ్ల్యూసీ సభ్యుడు గురుదీప్ సిప్పల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Congress appointment Teenmar Mallanna as Convener of PCC Campaign Committee.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now