Telangana Elections 2023: వీడియో ఇదిగో, సూర్యాపేట టికెట్ రాలేదని తెలిసి ఒక్కసారిగా ఏడ్చేసిన పటేల్ రమేశ్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి టికెట్ ఖరారు చేసిన కాంగ్రెస్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది నేతలు టికెట్ కేటాయింపు ఎంతో ఆశగా ఉన్న క్రమంలో చివరి సమయంలో టికెట్ దక్కకపోవడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. తాజాగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేశ్‌రెడ్డికి సైతం నిరాశ ఎదురైంది
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది నేతలు టికెట్ కేటాయింపు ఎంతో ఆశగా ఉన్న క్రమంలో చివరి సమయంలో టికెట్ దక్కకపోవడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. తాజాగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేశ్‌రెడ్డికి సైతం నిరాశ ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రమేశ్ రెడ్డికి టికెట్ నిరాకరించింది. అక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఖరారు చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ సన్నిహితుడైనప్పటికీ పటేల్ రమేశ్ రెడ్డికి టికెట్ దక్కలేదు.
దీంతో, రమేశ్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీని నమ్ముకుంటే అన్యాయం చేశారని బోరున విలపించారు. మరోవైపు పటేల్ రమేశ్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేడు సూర్యాపేటలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్టు తెలుస్తోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)