Telangana Elections 2023: సజ్జల అయినా జగన్ అయినా ఒకటే సమాధానం, కౌంటర్ విసిరిన వైఎస్ షర్మిల, కాంగ్రెస్‌కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని మండిపాటు

నేను ప్రజలకు అంకితం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎవరైనా సరే.. నాకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదని మండిపడ్డారు.

YS Sharmila (Photo-Video Grab)

నేను ప్రజలకు అంకితం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎవరైనా సరే.. నాకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కేసు కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడున్న అన్ని పార్టీల్లో దొంగలుంటారు.. కానీ ఆ దొంగలు మాత్రం సీఎంలు కావద్దని ఆమె వ్యాఖ్యానించారు.

గతంలో తాను తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదన్న సజ్జల, ఇప్పుడు తాను కాంగ్రెస్ కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే శక్తి కాంగ్రెస్ కే ఉందని, అందుకే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. మాతో ఉన్న సంబంధం గురించి సజ్జలే సమాదానం చెప్పాలని.. అదేవిధంగా ఏపీలో ఉన్న రోడ్లపై, విద్యుత్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగానే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం చెబుతారు? ముందు మీ పని, మీ కథ చూసుకోండి.అని షర్మిలా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila (Photo-Video Grab)

Here's Video

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement