Telangana Elections 2024: ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఇతర ప్రముఖ నేతలు, వీడియోలు ఇవిగో..

రెండు రాష్ట్రాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

CM Revanth Reddy and KCR And BRS and Congress Ministers Cast Their Votes

తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో సినీ నటులు, ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలో 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది.  తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై పీఎం మోదీ, అమిత్ షా స్పెషల్ ట్వీట్స్, రికార్డు స్థాయిలో ప్ర‌జ‌లు పోలింగ్‌లో పాల్గొనాల‌ని పిలుపు

రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఆయ‌న భార్య గీత‌, కూతురు నైమిషాతో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. కొడంగ‌ల్‌లోని జిల్లా ప‌రిష‌త్ బాలుర ఉన్న‌త పాఠ‌శాల‌లో ఓటేశారు. సిద్దిపేట జిల్లాలోని చింత‌మ‌డ‌క‌లో బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఆయ‌న స‌తీమణి శోభ త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు.

మోహన్‌బాబు, నాగచైతన్య, మంచు మనోజ్‌, విష్ణు, రాజమౌళి కుటుంబం ఓటు వేశారు. ఇక, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తన భార్యతో కలిసి సిద్దిపేటలోని అంబిటస్‌ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలింగ్ బాగా జ‌రుగుతోంది. 65 శాతానికి మించి పోలింగ్ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఎన్నిక‌ల త‌ర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీల‌దే కీల‌క పాత్ర అవుతుంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)