Telangana: ప్రజా భవన్‌ వద్ద బారికేడ్లను ఢీ కొట్టింది బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కొడుకే, వివరాలను వెల్లడించిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్

కేసులో మాజీ ప్రజాప్రతినిధి తనయుడ్ని తప్పించారని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో.. డీసీపీ మీడియాకు వివరాలను అందించారు

Ex-mla-shakeel-son-booked-over-praja-bhavan-incident

ర్యాష్‌ డ్రైవింగ్‌తో ప్రజా భవన్‌ వద్ద బారికేడ్లను ఢీ కొట్టిన కేసులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రహిల్‌ పేరును కూడా చేర్చినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. కేసులో మాజీ ప్రజాప్రతినిధి తనయుడ్ని తప్పించారని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో.. డీసీపీ మీడియాకు వివరాలను అందించారు. ప్రజా భవన్ వద్ద న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యారికేట్స్ ను అతివేగంగా వచ్చి ఓ బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టింది. కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారు. వీళ్లంతా స్టూడెంట్స్. కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. మిగతా వారిని అదుపులోకి తీసుకున్నాం’’ అని డీసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు.

సంబంధం లేని డ్రైవర్‌ను చూపించి దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించినప్పటికీ, విచారణలో షకీల్ కుమారుడి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించారు. షకీల్ కుమారుడు రాహెల్ కోసం గాలిస్తున్నట్లు డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు.రహిల్‌పై గతంలో జూబ్లీహిల్స్‌లో ఓ యాక్సిడెంట్‌ కేసు నమోదు అయ్యింది. ఆ కేసు పూర్వాపరాలను కూడా గమనిస్తాం. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల్ని కోర్టులో ప్రవేశపెడతాం అని డీసీపీ అన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif