Telangana: బీజేపీకి రాజీనామా చేసిన రాపోలు ఆనంద భాస్కర్, రాజీనామా లేఖను జేపీ నడ్డాకు పంపిన రాజ్యసభ మాజీ సభ్యుడు
ఈ మేరకు బుధవారం ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. బీజేపీ నుంచి వైదొలగుతున్నట్లు ఆయన తన లేఖలో వెల్లడించారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. బీజేపీ నుంచి వైదొలగుతున్నట్లు ఆయన తన లేఖలో వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ఉద్యోగిగా పనిచేసి ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న రాపోలు...తన రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
ఇటీవలే టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసిన రాపోలు... బీజేపీ విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి బీజేపీ సర్కారు తూట్లు పొడుస్తోందని ఆరోపించిన ఆయన... టీఆర్ఎస్ సర్కారు మాత్రం చేనేత కార్మికులకు అండగా నిలుస్తోందని తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)