మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి ఊరట లభించింది. కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి వేసిన పిటిషన్‌ను శుక్రవారం ఉదయం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, కాబట్టి ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి ఓ పిటిషన్ వేశాడు. వివేకా హత్య కేసు, అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు, కస్టడీ విచారణ అవసరం లేదని స్పష్టం
అయితే దస్తగిరి వాదనను అవినాష్ తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. చివరకు.. అవినాష్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన కోర్టు చివరకు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు ఇదే కేసులో అరెస్టైన అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో ఉదయ్‌కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ లకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.