Farmer Dies After Tractor Overturns: వెంటాడుతున్న విషాదాలు, 10 రోజుల్లో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు రైతులు మృతి, తాజాగా పొలం దున్నుతూ ట్రాక్టర్ బోల్తా పడి అన్నదాత మృతి
తెలంగాణలోని నాగరకర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వంగూరు మండలంలో వంగూరు గ్రామానికి చెందిన రైతు మీసాల లక్ష్మయ్య పొలం దున్నుతూ ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
తెలంగాణలోని నాగరకర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వంగూరు మండలంలో వంగూరు గ్రామానికి చెందిన రైతు మీసాల లక్ష్మయ్య పొలం దున్నుతూ ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
రెండు రోజుల క్రితం ఏపీలో అనకాపల్లి జిల్లాలోని కె.కోటపాడు మండలంలోని కింతాడ గ్రామానికి చెందిన బండారు శివ (35) శనివారం పొలంలో వరి దమ్ము దున్నుతుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో శివ ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కె.కోటపాడు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించారు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు
10 రోజుల క్రితం తెలంగాణలో జరిగిన ఘటనలో మరో యువకుడు ఇలాగే మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామంలో పొలం పనులు నిర్వహిస్తున్న వేళ ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బ్రహ్మ పృథ్విరాజ్ (సన్నీ) (21) యువకుడు ట్రాక్టర్ నడిపిస్తున్నాడు. అదే క్రమంలో ఒక్కసారిగా ట్రాక్టర్ బోల్తా పడటంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కాగా స్థానికులు మృతదేహాన్ని బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)