Car Catches Fire: వీడియో ఇదిగో, అన్నోజీ గూడా ఫ్లైఓవర్ మీద కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, క్షణాల్లోనే దగ్ధమైపోయిన కారు
ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన నలుగురు యువకులు రథసప్తమిని పురస్కరించుకొని, కొమురవెల్లి అంజన్న దర్శనానికి కారులో బయలుదేరారు.
ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన నలుగురు యువకులు రథసప్తమిని పురస్కరించుకొని, కొమురవెల్లి అంజన్న దర్శనానికి కారులో బయలుదేరారు. అన్నోజిగూడ ఫ్లైఓవర్ వద్దకు రాగానే కారులో నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు గమనించిన యువకులు వెంటనే కారులో నుండి దిగి బయటకు పరుగులు పెట్టారు.
వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం, భారీ కొండ చిలువను ఎలా ప్రశాంతంగా పట్టుకున్నాడో మీరో చూడండి
స్థానికులు, అటువైపుగా వెళ్తున్న వాహనదారులు కారులో నుండి మంటలు రావడాన్ని గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు.
అన్నోజీ గూడా ఫ్లైఓవర్ మీద కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు