Telangana Fire: వీడియో ఇదిగో, తెలంగాణలో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్ ట్యాంకర్ బోల్తా
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెంకటరావుపేట వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఘట్‌కేసర్ నుంచి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలోని ఓ బంకుకు డీజిల్ తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Here's Fire Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)