Telangana Floods: జగిత్యాలలో విషాదం, న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన ఎన్టీవీ జర్నలిస్ట్ గల్లంతు, గాలింపు చర్యలు ముమ్మరం చేసిన అధికారులు

గిరిజన కూలీలు వరదలో చిక్కుకున్న న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టు ప్రమాదంలో చిక్కుకున్నారు. రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన 9 మంది కూలీలు కుర్రులో పత్తి ఏరేందుకు వెళ్లి జలదిగ్బంధంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

Zameeruddin, NTV Telugu Journalist (Pic Credit: IANS)

గిరిజన కూలీలు వరదలో చిక్కుకున్న న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టు ప్రమాదంలో చిక్కుకున్నారు. రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన 9 మంది కూలీలు కుర్రులో పత్తి ఏరేందుకు వెళ్లి జలదిగ్బంధంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ఎఫ్ రక్షణ చర్యలు చేపట్టింది. ఈ న్యూస్ కవర్ చేసేందుకు జగిత్యాలకు చెందిన ఎన్టీవీ జర్నలిస్ట్ మిత్రుడితో కారులో ప్రయాణిస్తుండగా వారి కారు రామోజీపేట- భూపతిూర్ మధ్య కల్వర్ట్ దాటుతుండగా నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఇందులో జర్నలిస్ట్ మిత్రుడు బయటపడగా జర్నలిస్ట్ నదిలో కారుతో పాటు కొట్టుకుపోయాడు. అతని కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement