Telangana Floods: భారీ వరదలకు జంపన్నవాగులో 7 గురు గల్లంతు, నాలుగు మృతదేహాలు లభ్యం, ముగ్గురి కోసం హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు
మరో ముగ్గురి కోసం హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వరదలో కొట్టుకుపోయి గుర్తుతెలియని యాచకుడి మృతదేహం కరెంటు తీగలకు వేలాడుతుంది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగలు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో వర్షాలు బీభత్సంగా కురిశాయి. ములుగు జిల్లాలో జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో కొండాయి, మల్యాల గ్రామాలను వాగు ముంచెత్తింది. ఈ వాగులో ఏడుగురు గల్లంతు కాగా నాలుగు మృతదేహాలను బయటకు తీశారు. మరో ముగ్గురి కోసం హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వరదలో కొట్టుకుపోయి గుర్తుతెలియని యాచకుడి మృతదేహం కరెంటు తీగలకు వేలాడుతుంది.
Here's News