Telangana Floods: వీడియో ఇదిగో, తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించలేం, రాష్ట్రం పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తే నిధులు విడుదలకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

వర్షాలు, వరదలపై కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేసినా రాష్ట్రంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.

Union Coal Minister G Kishan Reddy (photo-ANI)

కేంద్రం జాతీయ విపత్తు ప్రకటనలు చేయడంలేదని, అవసరమైతే ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వర్షాలు, వరదలపై కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేసినా రాష్ట్రంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

వరదలతో మరణించిన వారి కుటుంబాలకు  కేంద్రం నుంచి రూ.3 లక్షలు వస్తాయని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన రూ.5 లక్షల పరిహారంలో కేంద్ర నిధులు కలుపుకొంటారా? లేదా ? అనేది స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఎస్డీఆర్‌ఎఫ్‌ కింద రూ.1300 కోట్ల వరకు ఉన్నాయని, వెంటనే ఆ డబ్బులతో బాధితులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రం పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని చెప్పారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)