Aligireddy Joins Congress: టీఆర్ఎస్‌ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్ర‌వీణ్ రెడ్డి

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కీల‌క నేత‌గా ఉన్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్ర‌వీణ్ రెడ్డి టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Former MLA Aligireddy joins Congress

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కీల‌క నేత‌గా ఉన్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్ర‌వీణ్ రెడ్డి టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి వెళ్లిన అలిగిరెడ్డి... రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖర్గే స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ ష‌బ్బీర్ అలీ పాల్గొన్నారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించిన‌ అలిగిరెడ్డి... 2014లో వొడితెల సతీష్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడిన ఆయ‌న‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. హుస్నాబాద్‌లో గత రెండు పర్యాయాలు టీఆర్‌ఎస్ టికెట్ సతీష్ ‌కుమార్‌కే దక్కిన నేప‌థ్యంలో గ‌త‌ కొంత కాలంగా అలిగిరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ దక్కదేమోనని భావించి తిరిగి సొంత గూటికి వెళ్లినట్లు స‌మాచారం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Andhra Pradesh Assembly Session 2025: అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్‌, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో మాట్లాడలేం, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి

CM Revanth Reddy At Yadagirigutta: వైభవంగా యాదగిరిగుట్ట దివ్య విమాన స్వర్ణ గోపురం ప్రారంభం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, దేశంలోనే ఎత్తైన గోపురంగా రికార్డు

Rahul Gandhi On SLBC Tunnel Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్, ప్రమాద ఘటనపై ఆరా, ఎస్‌ఎల్‌బీసీ డ్రోన్ విజువల్స్ ఇవే

Yadagirigutta Swarna Vimana Gopuram: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం నేడు.. హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. స్వర్ణ విమాన గోపురం విశేషాలు ఏంటంటే?

Share Now