ICU Patient Bitten by Rats: కామారెడ్డిలో ఐసీయూ పేషెంట్‌పై ఎలుకలు దాడి ఘటన, ఇద్దరు వైద్యాధికారులతో సహా నర్సింగ్‌ ఆఫీసర్‌ సస్పెండ్, ఉత్తర్వులు జారీ చేసిన వైద్య శాఖ

కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి లో శనివారం చోటుచేసుకున్న ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులపై తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై వేటు వేసింది. ఐసీయూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వసంత్‌ కుమార్‌, కావ్య తో పాటు నర్సింగ్‌ ఆఫీసర్‌ మంజులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Damodar Raja Narasimha (photo/X)

కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి లో శనివారం చోటుచేసుకున్న ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులపై తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై వేటు వేసింది. ఐసీయూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వసంత్‌ కుమార్‌, కావ్య తో పాటు నర్సింగ్‌ ఆఫీసర్‌ మంజులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విచారణ ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరికిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఓ రోగి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో రక్తపోటు సంబంధిత సమస్యలతో వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. అయితే అతని చేతులు, కాళ్లపై ఎలుకలు తీవ్రంగా కొరికి గాయపరచాయి. ఎలుకలు కుట్టడంతో చేతులు, కాళ్ల నుంచి రక్తం కారుతున్నట్లు బంధువులు గుర్తించారు. వారు వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వైద్య సిబ్బందిని అప్రమత్తమై షేక్‌ ముజీబ్‌ చికిత్స అందించారు.

Here's IANS Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement