Telangana: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్, 30 శాతం పీఆర్సీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన కేసీఆర్ సర్కారు

CM KCR (Photo-Twitter/TS CMO)

తెలంగాణ సాంస్కృతిక సారథిలో 583 మంది కళాకారులకు 30 శాతం పీఆర్సీ పెంచుతూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దీంతో కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందనున్నాయి. ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.24,514 వేతనం ఇస్తుండగా, 30 శాతం పీఆర్సీ పెంపుతో రూ.31,868 జీతం అందుకోనున్నారు.ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ 2020 ప్రకా రం.. పెంచిన పీఆర్సీ 2021 జూన్‌ 1 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. తదుపరి చర్యలు తీసుకోవాలని భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Telangana government taken decision to increase the PRC by 30 percent to 583 artistes under Telangana Cultural Sarathi

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now