Promotions in TS Police: తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు.. 18 మందికి ఎస్పీలుగా, 37 మందికి ఏఎస్పీలుగా పదోన్నతి
తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రమోషన్లు జరిగాయి.18 మంది అడిషనల్ ఎస్పీలను ఎస్పీలుగా, 37 మంది డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Hyderabad, June 10: తెలంగాణ (Telangana) పోలీసు శాఖలో (Police Department) భారీ ప్రమోషన్లు (Promotions) జరిగాయి.18 మంది అడిషనల్ ఎస్పీలను ఎస్పీలుగా (SP), 37 మంది డీఎస్పీలను (DSP) అడిషనల్ ఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులకు సంబంధించిన జీవో నిన్న రాత్రి విడుదలయింది. పదోన్నతి పొందిన అధికారులంతా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు పోలీసు అధికారులకు ప్రమోషన్ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ అంజనీ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. పదోన్నతి పొందిన అధికారులకు అభినందనలు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)