Gurukul School Students Protest: పురుగుల అన్నం పెడుతున్నారంటూ రోడెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థులు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మా గోడు వినాలని డిమాండ్, వీడియోలు ఇవిగో..
రంగారెడ్డి - శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి, ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారని విద్యార్థులు రోడ్డెక్కారు. మేం అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండని అంటున్నారని అన్నారు. మంచి నీటి సమస్య కూడా ఉంది. చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారు.
రంగారెడ్డి - శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి, ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారని విద్యార్థులు రోడ్డెక్కారు. మేం అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండని అంటున్నారని అన్నారు. మంచి నీటి సమస్య కూడా ఉంది. చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారు. భరోసా ఇవ్వాల్సిన ఉపాధ్యాయులే 10వ తరగతి పరీక్షల్లో మేము ఫెయిల్ అవుతమని బెదిరిస్తున్నారు. సీఎం రావాలని, సమస్యలు పరిష్కరించాలని రోడ్డు మీద బైటాయించి ధర్నా చేశారు విద్యార్థులు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్య హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. వీడియో ఇదిగో, పెళ్లిలో మటన్ కోసం తలలు పగలగొట్టుకున్నారు, పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారని కర్రలు, రాళ్లతో దాడి
తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు, నడిరోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నరు. ప్రభుత్వ పట్టింపులేని తనం, అధికారుల నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నది. పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నరు. గురుకులాల్లో నెలకొన్నసమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోండి. పరిపాలన మీద దృష్టి సారించి, ప్రజల సమస్యలను పట్టించుకోండని తెలిపారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)