Telangana: ఆ 23 గ్రామాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు, అవన్నీఐదో షెడ్యూల్ కిందకే వస్తాయని తెలిపిన ధర్మాసనం, ఫలించిన 75 ఏళ్ల ఆదివాసీల పోరాటం
ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యంగంలోని ఐదో షెడ్యూల్ కిందకే వస్తాయని తెలిపింది.
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న 23 గ్రామాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యంగంలోని ఐదో షెడ్యూల్ కిందకే వస్తాయని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బుధవారం తీర్పు ప్రకటించారు. 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువడింది.
ఆదివాసుల తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. అయితే, ఆ 23 గ్రామాలు రాజ్యాంగ పరిధిలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి రావనీ ఆదివాసీయేతర నేతలు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఆదివాసీలకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)