Accident Video: వీడియో ఇదిగో, ఎక్సైజ్ సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మహిళ మృతి, పోలీసుల నుంచి న్యాయం జరగడం లేదని ధర్నాకు దిగిన మృతురాలి బంధువులు
హన్మకొండ జిల్లాలోని కాజీపేట కేంద్రంలో సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ వద్ద కవిత అనే మహిళ బైక్ ఎక్కబోతుండగా ఓ కారు హైస్పీడ్‌లో వచ్చి ఆమెను ఢీకొట్టింది.
తెలంగాణలోని హన్మకొండలో ఓ సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా నడిరోడ్డుపై ఓ మహిళ మృతిచెందింది. హన్మకొండ జిల్లాలోని కాజీపేట కేంద్రంలో సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ వద్ద కవిత అనే మహిళ బైక్ ఎక్కబోతుండగా ఓ కారు హైస్పీడ్‌లో వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఎక్సైజ్ సీఐ శరత్ కొడుకు వంశీ.. TS03 FA9881 నెంబర్ కారును అధిక వేగంతో డ్రైవ్ చేసి రాంగ్ సైడ్‌లో బైక్‌ను ఓవర్‌టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఫోన్ మాట్లాడుతున్న కవితను కారు బలంగా ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
అయితే వంశీని ఈ కేసు నుంచి కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయడం లేదని మృతురాలి బంధువుల ఫాతిమా నగర్ జంక్షన్‌లో ధర్నాకు దిగారు. దీంతో, రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక, కవితకు వివాహం కాగా, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు సమాచారం.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)