BMW Hit-And-Run Video: బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బైకును ఈడ్చుకుంటూ పోయిన బీఎండబ్ల్యూ కారు, వీడియో ఇదిగో..
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటలకు రాంగ్ రూట్‌లో వస్తున్న బీఎండబ్ల్యూ కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొంది. అంతటితో ఆగకుండా బైక్‌ను కొంత దూరం వరకు లాక్కెళ్లింది.
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటలకు రాంగ్ రూట్‌లో వస్తున్న బీఎండబ్ల్యూ కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొంది. అంతటితో ఆగకుండా బైక్‌ను కొంత దూరం వరకు లాక్కెళ్లింది. ఈ ఘటనలో జీహెచ్‌ఎంసీ ఏరియా మేనేజర్ పనిచేస్తున్న బాలచందర్ తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు బాల చందర్‌ను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారు నెంబర్ (TS09EJ5688) పోలీసులు నిర్థారించారు. ఈ సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)