Telangana: బీజేపీ కార్యకర్త ఇంటికి వచ్చిన అమిత్ షా, దళిత నేత ఇచ్చిన తేనీరును సేవించిన కేంద్ర హోం మంత్రి, తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు పాలనా తీరుపై ఆరా
మునుగోడులో బీజేపీ నిర్వహిస్తున్న సభకు హాజరయ్యేందుకు తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... సికింద్రాబాద్‌కు చెందిన బీజేపీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లారు.
మునుగోడులో బీజేపీ నిర్వహిస్తున్న సభకు హాజరయ్యేందుకు తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... సికింద్రాబాద్‌కు చెందిన బీజేపీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సత్యనారాయణ దంపతులను తన పక్కనే కూర్చోబెట్టుకున్న అమిత్ షా... వారితో పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌లను వెంటబెట్టుకుని అమిత్ షా...సత్యనారాయణ ఇంటికి వెళ్లారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ కుటుంబం ఇచ్చిన తేనీరును సేవించిన అమిత్ షా... తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు పాలనా తీరుపై ఆరా తీశారు. రాష్ట్రంలో దళితులను సీఎం కేసీఆర్ దారుణంగా మోసం చేస్తున్నారని అమిత్ షాకు సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చడం లేదని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే తెలంగాణలో దళితులకు మేలు జరుగుతుందని ఆయన అమిత్ షాకు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)