TSRTC: లారీ కిందకు దూసుకెళ్లిన యువతి, తృటిలో చావు నుంచి తప్పించుకున్న వైనం, రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ వీడియో షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ వీడియోని ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ వీడియోలో ట్రాఫిక్ జామ్‌లో ఓ యువతి లేన్‌ని క్రాస్ చేసి లారీ ముందుకు తన ద్విచక్ర వాహనాన్ని ఆపుతుంది. అంతలో వెనుక ఉన్న లారీ ముందుకు కదిలింది.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ వీడియోని ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ వీడియోలో ట్రాఫిక్ జామ్‌లో ఓ యువతి లేన్‌ని క్రాస్ చేసి లారీ ముందుకు తన ద్విచక్ర వాహనాన్ని ఆపుతుంది. అంతలో వెనుక ఉన్న లారీ ముందుకు కదిలింది. ఈ క్రమంలో వాహనం బైక్‌ని ఢీకొట్టడంతో ఆమె లారీ కింద పడిపోతుంది. అయితే లారీ డ్రైవర్ మాత్రం తన వాహనాన్ని ఆపక ముందుకు నడిపిస్తాడు.
అదృష్టవశాత్తు ఆ యువతి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంటుంది. ఈ వీడియో షేర్ చేసిన ఆయన ద్విచక్రవాహనదారులకు రోడ్డపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తతో పాటు నిబంధనలు పాటించడం ఎంతైనా అవసరమని సూచించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)