IAF Aircraft Crashlands in Toopran: తూప్రాన్ లో కూలిన శిక్షణ హెలికాప్టర్.. ఒకరు లేక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసుల అనుమానం
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్ కూలింది. హైదరాబాద్ కు చెందిన హెలికాప్టర్ సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది.
Toopran, Dec 4: మెదక్ జిల్లా (Medak) తూప్రాన్ (Toopran) మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్ (trainee aircraft) కూలింది. హైదరాబాద్ కు చెందిన హెలికాప్టర్ సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది. భారీగా శబ్దం రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కూలిన శిక్షణ హెలికాప్టర్‌లో మంటలు చెలరేగి ఒకరు లేక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)