Munugode Bypoll 2022: వైరల్ వీడియో, నువ్వు ఆఫ్ట్రాల్ ఒక ఎస్సైవో, సీఐవో, అయాం డాక్టర్ కేఏ పాల్... బీ కేర్ ఫుల్, పోలీసు అధికారిపై మండిపడిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
మునుగోడు ఎన్నికల బరిలోకి దిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్..తన పట్ల ఒక పోలీసు అధికారి అనుచితంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. నాపై మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తావా? అంటూ ఫైర్ అయ్యారు. మిగిలిన పోలీసులంతా తనతో గౌరవంగా ఉన్నారని... నీవు మాత్రం గౌరవం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నావని మండిపడ్డారు
మునుగోడు ఎన్నికల బరిలోకి దిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్..తన పట్ల ఒక పోలీసు అధికారి అనుచితంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. నాపై మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తావా? అంటూ ఫైర్ అయ్యారు. మిగిలిన పోలీసులంతా తనతో గౌరవంగా ఉన్నారని... నీవు మాత్రం గౌరవం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నావని మండిపడ్డారు.'నువ్వు ఆఫ్ట్రాల్ ఒక ఎస్సైవో, సీఐవో... అయాం డాక్టర్ కేఏ పాల్... బీ కేర్ ఫుల్' అంటూ హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ గా పని చేస్తున్నావా? అని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా తన పట్ల చాలా గౌరవంగా ఉంటారని చెప్పారు. తాను శాంతిదూతనని రేవంత్ చెప్పారని... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న తనతో ఎంత బాగా వ్యవహరించారో చూడలేదా? అని అడిగారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)