Telangana: సార్ మా అమ్మానాన్న రోజూ కొడుతున్నారు, వారిని శిక్షించండి, పోలీస్ స్టేషన్ గడప తొక్కిన బాలుడు, భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చిన ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి
స్టేషన్ కి వెళ్లి ‘సార్.. మా అమ్మానాన్న కొడుతున్నారు.. నిత్యం నరకం చూపిస్తున్నారు. వారిని శిక్షించండి’’అంటూ శంకర్‌పల్లి పోలీసులను ఆశ్రయించాడు.
శంకరపల్లిలో ఓ బాలుడు తల్లిదండ్రులు కొడుతున్నారంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. స్టేషన్ కి వెళ్లి ‘సార్.. మా అమ్మానాన్న కొడుతున్నారు.. నిత్యం నరకం చూపిస్తున్నారు. వారిని శిక్షించండి’’అంటూ శంకర్‌పల్లి పోలీసులను ఆశ్రయించాడు. ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా మద్దూరుకు చెందిన మాల నర్సింహులు, లక్ష్మి దంపతులు శంకర్‌పల్లిలోని హనుమాన్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రోజు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మీకి మొత్తం ఐదు మంది సంతానం. వారిలో ఒకడైన రామును ప్రతిరోజు కొట్టడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలుడిని మరోసారి కొడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)