Telangana: బీజేపీ పోస్ట‌ర్‌పై తొలిసారిగా కోమ‌టిరెడ్డి ఫోటో, మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

మొన్న‌టిదాకా మునుగోడు ఎమ్మెల్యేగా కొన‌సాగిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. మ‌రికాసేప‌ట్లో బీజేపీలో చేరిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌... త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్నారు.

komatireddy-raj-gopal-reddy-releases-a-poster-to-invite-amit-shah-for-munugodu-meeting

మొన్న‌టిదాకా మునుగోడు ఎమ్మెల్యేగా కొన‌సాగిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. మ‌రికాసేప‌ట్లో బీజేపీలో చేరిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌... త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్నారు. బీజేపీలోకి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి చేర‌బోతున్న త‌రుణంలో ఆదివారం ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట‌ర్‌ను పోస్ట్ చేశారు. మునుగోడు స‌భ‌కు వ‌స్తున్న అమిత్ షాకు స్వాగ‌తం చెబుతూ కోమ‌టిరెడ్డి ఆ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో అమిత్ షాతో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ల ఫొటోల‌ను అమ‌ర్చిన కోమ‌టిరెడ్డి...కింద త‌న బొమ్మ‌ను ఏర్పాటు చేశారు. వెర‌సి బీజేపీ పోస్ట‌ర్‌పై కోమ‌టిరెడ్డి తొలిసారిగా త‌న ఫొటోను ముద్రించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Amit Shah AP Tour Details: ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్‌ షాకు విందు

Padi Kaushik Reddy Granted Bail: పాడి కౌశిక్‌ రెడ్డికి కోర్టులో భారీ ఊరట, మూడు కేసుల్లో బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని కోర్టుకు తెలిపిన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే

Padi Koushik Reddy Arrest: పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన కరీంనగర్‌ పోలీసులు, డాక్టర్‌ సంజయ్‌పై పరుష పదజాలం..అదుపులోకి

Share Now