Telangana: హెటిరో డ్రగ్స్‌ పరిశ్రమలోకి చిరుత, క్షేమంగా పట్టుకున్న అటవీ అధికారులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడి

శనివారం ఉదయం నాలుగు గంటలకు హెటిరో డ్రగ్స్‌ హెచ్‌బ్లాక్‌లోకి చిరుత చొరబడింది. పక్కనే విధులు నిర్వహిస్తున్న కార్మికులు చిరుతను చూసి హెచ్‌బ్లాకులోని డోర్లను మూసి పరిశ్రమ యాజమాన్యం, అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారాన్ని అందించారు.

leopard-attack (Photo Credits: Uttarakhand forest department)

జిన్నారం మండలంలోని హెటిరో డ్రగ్స్‌ పరిశ్రమలోకి శనివారం వేకువజామున చొరబడిన చిరుతను అటవీ అధికారులు పట్టుకుని బంధించారు. శనివారం ఉదయం నాలుగు గంటలకు హెటిరో డ్రగ్స్‌ హెచ్‌బ్లాక్‌లోకి చిరుత చొరబడింది. పక్కనే విధులు నిర్వహిస్తున్న కార్మికులు చిరుతను చూసి హెచ్‌బ్లాకులోని డోర్లను మూసి పరిశ్రమ యాజమాన్యం, అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారాన్ని అందించారు.

అటవీ అధికారులు చిరుతను పట్టేందుకు ఆపరేషన్‌ చేపట్టారు. అధికారులు ఏర్పాటు చేసిన బోనులోకి చిరుత వెళ్లకపోవటంతో జూపార్కుకు చెందిన వైద్యులు తుపాకి పేల్చి మత్తును ఎక్కించారు. స్పృహ కోల్పోవటంతో బోనులో బంధించి హైదరాబాద్‌లోని జూపార్కుకు తరలించారు. ప్రస్తుతం చిరుత యాక్టివ్‌గా ఉందని, ఎవరికీ ఎలాంటి నష్టం కలుగలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)