VRA's Stormed Into Ministers Quarters (Credits: X)

Hyderabad, Feb 4: హైదరాబాద్ లోని (Hyderabad) మినిస్టర్స్ క్వార్టర్స్‌ ను వీఆర్ఏలు (VRA's Stormed Into Ministers Quarters) ముట్టడించారు. 3797 మంది వీఆర్ఏలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… మినిస్టర్స్ క్వార్టర్స్‌ ముట్టడికి నిరసనకారులు పిలుపునిచ్చారు. 15 నెలలుగా ఎదురుచూస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నిరసనకు దిగారు. మంత్రిని కలవడానికి అనుమతి ఇవ్వడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్, సీఎం చంద్రబాబుతో భేటీ

లాఠీచార్జీ కూడా..

మినిస్టర్ క్వార్టర్స్‌ లోకి దూసుకెళ్తున్న నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు.  దీంతో పోలీసులకు, వీఆర్ఏలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తంగా పరిస్థితి మారింది. లాఠీచార్జీ కూడా జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నేడు రథ సప్తమి.. తిరుమల, అరసవల్లిలో సంబురాలు.. పోటెత్తిన భక్తులు (వీడియో)