Covid in Telangana: తెలంగాణలో కొత్తగా 1,362 కరోనా కేసులు, 10మంది మృతి, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు, రాష్ట్రంలో ప్రస్తుతం 18,568 యాక్టివ్ కేసులు
తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. గత 24 గంటల్లో 1,23,005 మంది నమూనాలు పరీక్షించగా..కొత్తగా 1,362 కరోనా కేసులు నమోదయ్యాయి. 10మంది మృతి చెందారు.
తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. గత 24 గంటల్లో 1,23,005 మంది నమూనాలు పరీక్షించగా..కొత్తగా 1,362 కరోనా కేసులు నమోదయ్యాయి. 10మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,556కి చేరింది. కరోనా నుంచి నిన్న 1,813 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని (Lockdown Lifted in Telangana) కేబినెట్ నిర్ణయించింది. లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ (TS Cabinet) ఆదేశించింది. కేబినెట్ తాజా నిర్ణయాలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)