Corona in TS: తెలంగాణలో కొత్తగా 156 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 33,140 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 22, రంగారెడ్డి జిల్లాలో 14, సిద్ధిపేట జిల్లాలో 12, ఖమ్మం జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 33,140 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 53 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 22, రంగారెడ్డి జిల్లాలో 14, సిద్ధిపేట జిల్లాలో 12, ఖమ్మం జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 207 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,720 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,72,063 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,642 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,015 మంది కరోనాతో మరణించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement