Corona in TS: తెలంగాణలో కొత్తగా 167 మందికి కరోనా పాజిటివ్, జీహెచ్ఎంసీ పరిధిలో 66 కొత్త కేసులు, ఇంకా 3,933 మందికి కొనసాగుతున్న చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,941 కరోనా పరీక్షలు నిర్వహించగా, 167 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 66 కొత్త కేసులు నమోదయ్యాయి. వనపర్తి, నిర్మల్, నారాయణపేట, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 207 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,71,790 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,63,898 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,933 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,959కి పెరిగింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement