Corona in TS: తెలంగాణలో ఈ నెల 20వ తేదీ వరకు ఆంక్షలు పొడిగింపు, కొత్తగా 1,673 మందికి కరోనా, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,94,030 పాజిటివ్ కేసులు నమోదు
1,673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,165 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 149, రంగారెడ్డి జిల్లాలో 123 కేసులు గుర్తించారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 48,583 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 1,673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,165 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 149, రంగారెడ్డి జిల్లాలో 123 కేసులు గుర్తించారు. అదే సమమంలో 330 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,94,030 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,76,466 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,522 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,042కి పెరిగింది.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉన్న ఆంక్షలను ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో గత నెల 25న ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేటితో ఆంక్షల గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 25 వరకు వీటిని పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ సభలు, ర్యాలీలు, మతపరమైన కార్యక్రమాలతోపాటు రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)