Corona in TS: తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 61 కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 61 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37,844 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 61 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37,844 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,72,650కు చేరింది. తాజాగా 168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 6,64,933 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 3,967కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.85 శాతం నమోదు అయింది. మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,754 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement