Corona in TS: తెలంగాణలో కొత్తగా 184 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు నమోదు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ట స్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 33,236 కరోనా పరీక్షలు నిర్వహించగా, 184 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 33, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus test (Photo-ANI)

తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ట స్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 33,236 కరోనా పరీక్షలు నిర్వహించగా, 184 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 33, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 137 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,798 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,68,227 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,581 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,990కి పెరిగింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement