Corona in TS: తెలంగాణలో కొత్తగా 324 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులు నిర్ధారణ , ప్రస్తుతం రాష్ట్రంలో 5,325 యాక్టివ్ కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. ఇదే సమయంలో 280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,62,526కి చేరుకుంది.

Coronavirus Outbreak (Photo credits: IANS)

తెలంగాణలో గత 24 గంటల్లో 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. ఇదే సమయంలో 280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,62,526కి చేరుకుంది. ఇక మొత్తం 6,53,302 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 3,899 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 73,323 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.60 శాతంగా ఉందని, మరణాల రేటు 0.58 శాతంగా ఉందని తెలంగాణ ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,325 యాక్టివ్ కేసులు ఉన్నాయి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement