Covid in TS: తెలంగాణలో తగ్గని కరోనా, గత24 గంటల్లో 531 కొత్త కేసులు, రాష్ట్రంలో తాజాగా మంకీఫాక్స్ వైరస్ కలకలం

గడచిన 24 గంటల్లో 24,927 కరోనా పరీక్షలు నిర్వహించగా, 531 కొత్త కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో 281, రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 24,927 కరోనా పరీక్షలు నిర్వహించగా, 531 కొత్త కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో 281, రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 612 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,14,303 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,05,562 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,630 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ మంకీపాక్స్ కలకలం రేగింది. ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉండడంతో అతడిని వైద్యులు ఈ నెల 20 నుంచి అబ్జర్వేషన్ లో ఉంచారు. తాజాగా, అతడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)