Corona in TS: తెలంగాణలో కొత్తగా 540 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 272 కొత్త కేసులు, ఇంకా 4,481 మందికి కొనసాగుతున్న చికిత్స

మరో 603 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అత్యధికంగా హైదరాబాదులో 272 కొత్త కేసులు నమోదయ్యాయి.

A resident gets tested for coronavirus in the Liwan District in Guangzhou in southern China (Photo: PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,585 శాంపిల్స్ పరీక్షించగా, 540 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 603 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అత్యధికంగా హైదరాబాదులో 272 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 26, రంగారెడ్డి జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో 15, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 708 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో తాజాగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,10,318 మంది కరోనా బారినపడగా, వారిలో 8,01,726 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,481 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)