Covid in TS: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో 552 మందికి కోవిడ్, హైదరాబాదులో అత్యధికంగా 316 కొత్త కేసులు నమోదు
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కరోనా రోజువారీ కేసుల సంఖ్య 500కి పైన నమోదైంది. గడచిన 24 గంటల్లో 25,913 కరోనా పరీక్షలు నిర్వహించగా, 552 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 316 కొత్త కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కరోనా రోజువారీ కేసుల సంఖ్య 500కి పైన నమోదైంది. గడచిన 24 గంటల్లో 25,913 కరోనా పరీక్షలు నిర్వహించగా, 552 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 316 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 51, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 36, సంగారెడ్డి జిల్లాలో 28 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 496 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,03,374 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 7,94,510 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,753 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement